MP Sushmita Dev: రాజ్యసభకు టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ గుడ్‌బై
MP Sushmita Dev: రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తృణమూల్ పార్టీని వీడారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. సుష్మితా దేవ్ తండ్రి ఫేమస్ బెంగాలీ నేత సంతోష్ మోహన్ దేవ్. గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ వుమెన్ వింగ్ చీఫ్‌గా చేశారామె.
న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్(MP Sushmita Dev) ఆ పార్టీని వీడారు. పార్టీకి చెందిన అన్ని పోస్టులకు ఆమె రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. 53 ఏళ్ల సుష్మితా దేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆమె 2021లో తృణమూల్ పార్టీలో చేరారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నట్లు ఆమె చెప్పారు. సుష్మితా దేవ్ తండ్రి ఫేమస్ బెంగాలీ నేత సంతోష్ మోహన్ దేవ్. గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ వుమెన్ వింగ్ చీఫ్‌గా చేశారామె. అస్సాంలోని సిల్చార్ నుంచి ఆమె గతంలో ఎంపీగా చేశారు.
సోమవారం రోజున రాజ్యసభ ఎంపీ సుఖేందు శేకర్ రాయ్ .. పార్లమెంట్‌తో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాయ్ తన పత్రికా ప్రకటనలో తృణమూల్ పై అటాక్ చేశారు. బెంగాల్లో 15 పాలన పేలవంగా సాగిందన్నారు. బెంగాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ లక్ష్యాలను అమలు చేసేందుకు సంపూర్ణంగా పనిచేస్తున్నదని, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, తృణమూల్ పార్టీ ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాయ్ తన ప్రకటనలో చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

