యాదాద్రి: యాదాద్రిలో క్యూలైన్ల పనులతోపాటు ఎస్కలేటర్ బిగింపు పనుల్లో అధికారులు వేగం పెంచారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎస్కలేటర్(కదిలేమెట్ల) నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
క్యూ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నుంచి చివరి అంతస్తు గల ప్రసాద విక్రయశాల వద్దకు మూడు ఎస్కలేటర్లను నిర్మించా ల్సి ఉండగా ఇప్పటికే ఎస్కలేటర్ యాదాద్రికి చేరుకోగా మిగతా రెండు ఎస్కలేటర్లను శుక్రవారం స్వామి వారి చెంతకు చేరుకున్నాయి.
ఒక్కో ఎస్కలేటర్ సుమారు 35 ఫీట్ల పొడవు ఉంటుందని వైటీడీఏ అధికారులు తెలిపారు. త్వరలో వీటి బిగింపు ప్రక్రియను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.