యాదాద్రి: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలను వరం లాంటిదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బొజ్జ వెంకటేశంకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 22,000 మంజూరు కాగా ఆదివారం పట్టణంలో లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు.
కొవిడ్ ఆపత్కాలంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా విషయంలో మరింత జాగ్రతగా ఉండాలని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకట య్య, పట్టణ నాయకులు అంకం నర్సింహా, కీసరి బాలరాజు, ముఖ్యర్ల సతీశ్ యాదవ్, ఎరుకల హేమేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.