భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 7 : గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.30 లక్షలతో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనంలో మొక్క నాటారు. అనంతరం బండసోమారం గ్రామంలో రామలింగేశ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పల్లెప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, ఎంతోకాలంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు నోముల పరమేశ్వర్‌రెడ్డి, నల్లమాస రమేశ్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచులు నోముల పద్మామహేందర్రెడ్డి, నానం పద్మాకృష్ణ, ఎంపీటీసీలు రాసాల మల్లేశ్, కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, నాయకులు మధుసూదన్‌రెడ్డి, రమేశ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, వీరేశ్‌యాదవ్ పాల్గొన్నారు.