అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
భువనగిరి కలెక్టరేట్, మార్చి 22 : యాదాద్రి భువనగిరిని రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని మహిళా సంక్షేమ, వైద్యశాఖ అధికారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంపై ఐసీడీఎస్ సీడీపీఓలు, హెల్త్ సూపర్వైజర్లకు నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా, శిశు సంక్షేమ, వైద్య శాఖ సమన్వయంతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పని చేసి రక్తహీనత, పోషణ లోపం నివారణకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. రక్తహీనత, పోషణ లోపం నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తల్లిపాల ఆవశ్యకతపై ఇంటింటికీ తెలియజెప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు తల్లిపాలలో ఉండే పోషకాలు, రోగ నిరోధక సామర్థ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, ఐసీడీఎస్ సీడీపీఓలు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ల్యాండ్ పూలింగ్‌కు 73 ఎకరాలు..
బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి) : ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు మండలంలోని మెహర్‌నగర్‌లో 73 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను గుర్తించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూరజ్ కుమార్‌తో కలిసి భూ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి ల్యాండ్ పూలింగ్ విధి విధానాలు వివరించి వారి అభిప్రాయాలు సేకరించారు.