ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
ఘనంగా నర్సయ్యగౌడ్ జన్మదిన వేడుక
చౌటుప్పల్, మార్చి 2 : భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి, నల్లగొండ జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బూర భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. భవిష్యత్‌లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం తనకు జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన నేతలకు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు పాశం సురేందర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, పలు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.