యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్త జనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతో ఇలవే ల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసింది.
కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా కొండ పైకి వాహనాలను అనమతించలేదు. స్వామి వారి ధర్మదర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.