చెన్నై: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో స్నేహిత్ 3-2(9-11, 15-17, 11-4, 11-6, 18-16)తో 13వ సీడ్ జపాన్ ప్లేయర్ మిజుకి ఒయికవాపై అద్భుత విజయం సాధించాడు.
మ్యాచ్‌లో తొలుత 0-2తో వెనుకంజలో ఉన్న స్నేహిత్ పుంజుకుని ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. 52నిమిషాల పాటు సాగిన పోరులో స్నేహిత్ అంచనాలకు మించి రాణించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. మరోవైపు సాతియాన్ 11-7, 9-11, 11-9, 13-11తో లిమ్ జాంగ్హున్పై, మానుశ్ షా 11-6, 11-7, 11-9తో పార్క్ గ్యుహెన్పై గెలిచి ముందంజ వేశారు.