
భూదాన్‌పోచంపల్లి, జూన్28: గ్రామాల అభివృద్ధే ధ్యేయం గా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నా రు. సోమవారం మండలంలోని అంతమ్మగూడెం, దోతిగూ డెం, కనుముక్కుల, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. గ్రామాల్లోని అన్ని వార్డు ల్లో కలియతిరిగి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం డలం లో ప్రతి ఏడాది హెచ్ఎండీఏ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు గ్రామాల్లో త్వరగా జరిగే లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అంతమ్మగూడెం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వలను, దోతిగూడెం గ్రామంలో రూ.8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, కనుముక్కుల గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు.
ధర్మారెడ్డిపల్లి గ్రామంలో రూ.5లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన ధర్మారెడ్డిపల్లిలో 17కుటుంబాలకు, అంతమ్మగూడెంలో 12 కుటుంబాలకు, కనుముక్కులలో 26 కుటుంబాలకు, దోతిగూడెంలో 26కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 వేల చొప్పున వారికి పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు కందాడి భూపాల్‌రెడ్డి, అందెల లింగంయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పగిళ్ల సుధాకర్‌రెడ్డి, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సామ రవీందర్‌రెడ్డి, వస్పరి పారిజాతామహేశ్, పగిళ్ల స్వప్న రామ్‌రెడ్డి, అంజిరెడ్డి, ఎంపీటీసీలు మాధవీశ్రీశైలం గౌడ్, శ్రీదేవీశేఖర్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు బీబీనగర్ మండలంలో పల్లెబాట
బీబీనగర్, జూన్28: మండలంలోని కొండమడుగు గ్రా మంలో మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పల్లెబాటలో భాగంగా పర్యటించనున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.