మోసపోతే గోసపడతాం
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
- అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటువేయాలి
- దుబ్బాకలో గెలిచేది గులాబీ జెండానే
- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, ఫిబ్రవరి 8: కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం రాత్రి, ఆదివారం 12, 13, 14, 17, 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు చెక్కపల్లి శ్రీలేఖ రాజు, ఆస సులోచన , భూపాల్, వడ్లకొంద సుభద్ర, అంకం హేమలత , శ్రీరాం సంగీతతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ సారు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచితే, కేవలం రెండేండ్లలో కాంగ్రెస్ ఆగం చేసిందని దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశా రు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. దుబ్బాకపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటుంది కానీ రేవంత్‌రెడ్డికి ఉంటుందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
ఆసరా పింఛన్లతో వృద్ధులకు పెద్ద కొడుకుగా, కల్యాణలక్ష్మి , కేసీఆర్ కిట్‌తో మేనమామగా కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తుచేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో రైతులకు సాగునీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ సారు కాదా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిన తెలంగాణకు తెచ్చిన నిధులు గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, వెంకటనర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, భూంరెడ్డి,రాజు, శ్రీనివాస్, యాదగిరి, ఖలీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

