కొత్తకోట, ఫిబ్రవరి 8 : దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డులో ఆదివారం ఇంటిం టి ప్రచారం నిర్వహించి అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కొత్తకోట మున్సిపాలిటీని రూ. 50కోట్లతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం తాను సాధించిన నిధులకు పేర్లు మార్చి కొత్త శిలాఫలకాలు వేసి మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజలకు మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల విమర్శించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తకోట ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు.
మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కొత్తకోట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు కోరారు. కార్యక్రమంలో కొత్తకోట ము న్సిపల్ ఇన్చార్జి అభిలాష్ రావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వశ్వర్, మాజీ ఎం పీపీ గుంత మౌనిక, మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాబురెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాక వరలక్ష్మి నరసింహతో పాటు బీఆర్ఎస్ నాయకులు, ఆ వార్డు ప్రజలు పాల్గొన్నారు.