
భూదాన్‌పోచంపల్లి, జూన్ 25: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దరావులపల్లి, కఫ్రాయిపల్లి గ్రామాల్లో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో ఆయన పాల్గొనిమాట్లాడారు. భువనగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు లాంటి అన్ని వసతులు కల్పిస్తునట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణాళికను పాటిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కఫ్రాయిపల్లిలో రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వలను ప్రారంభించారు.
ఇటీవల మరణించిన 42 కుటుంబాలకు పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెద్దరావులపల్లిలో బట్టుగూడెం- పెద్దరావులపల్లి గ్రామాలపై మూసీనదిపై నిర్మించిన వంతెనను, రూ.11.75 లతో నిర్మించిన వైకుంఠధామం, రూ. 22 లక్షలతో నిర్మించిన రైతువేదికను, రూ.25 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశంయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ భూపాల్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్‌లు బాలమణి,ప్రభాకర్, భిక్షపతి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అండగా ఉంటా..
పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అండగా ఉంటానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పోచంపల్లి ము న్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో రూ.50 లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పోచంపల్లి మున్సిపాటిటీని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతానన్నారు. ఇప్పటికే పోచంపల్లి పట్టణ సుందరీకరణకు ఏర్పాటు చేస్తున్న డబుల్ రోడ్డు, సెంటర్ డివైడర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పోచంపల్లి పట్టణ అభివృద్ధికి వా సాలమర్రి సభలో సీఎం కేసీఆర్ మరో రూ.50 లక్షలు ప్రకటించినందుకు ఆయనకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీ శ్రీనివా స్, వైస్ చైర్మన్ లింగస్వామి, కౌన్సిలర్లు మధు, మల్లారెడ్డి, వెంకటేశం, మల్లేశంగౌడ్, మహేశ్, కిరణ్, శ్రవణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.