
యాదాద్రి, జూన్25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు సర్వహంగులతో జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైటీడీఏ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణా లు ప్రారంభమైన నాటి నుంచి 15 దఫాలుగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీ ఎం కేసీఆర్ పలు సూచనలు, సలహాలు చేశారు. యాదాద్రీశుడి దివ్యక్షేత్రం పనులు దాదాపుగా పూర్తికాగా, భక్తుల సౌకర్యాల పనులు సాగుతున్నాయి. అనుబంధ శివాలయంలో తుది మెరుగుల పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి క్షేత్రం మొదటి నుంచి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల్లో సుమారు 75 శాతం మంది కొండపైన ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ప్రధానాలయాన్ని పునర్నిర్మించే క్రమంలో శివాలయాన్ని కూడా విశాలంగా విస్తరించారు. గతంలో 500 గజాల్లో మాత్రమే శివాలయం ఉండేది.
ఇప్పుడు ఎకరం స్థలంలో నవగ్రహ మండపం, ఆంజనేయస్వామి మండపం, మరకత మండపం, బయట రామాలయం, ఆల యం చుట్టూ ప్రాకారాలతో పనులు పూర్తయ్యా యి. శివాలయం లోపల రాతి ముఖమండపం ఆంజనేయస్వామి ఆలయం, గణపతి ఆలయం, పర్వతవర్ధినీ సమేత అమ్మవారి ఆలయం, యాగశాల పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా ప్రాకారంలోని సాలహారాల్లో విగ్రహాల అమరిక, అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల సిమెంట్ విగ్రహాల పనులు పూర్తయ్యాయి. శివాలయం ముఖమండపం ఎదురుగా ధ్వజస్తంభానికి వెనుక వైపు ఉన్నటువంటి ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించేలా ఉండేందుకు శివాలయ ప్రధానాలయ ముఖమండపం చుట్టూ ఉన్న పిలర్ల మధ్యలో ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఆలయ లోపలి భాగం గా ఫ్లోరింగ్ పనులు, బయట ఉత్తర భాగంలో ఫ్లోరింగ్ పనులు ముగిశాయి. బయట వీధుల్లో కల్యాణ మండపం పూర్తికాగా, రథశాలకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఫైబర్‌తో రూపొందించిన తొ డుగులను బిగించనున్నారు. శివాలయం ముం దుగా 8.50 ఫీట్ల ఎత్తుతో నిర్మించిన ప్రహరీని తొలగించి ప్యారాపిట్ వాల్‌ను నిర్మించి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. శివాల య ప్రహరీ ప్రాంతంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకంగా తయారు చేసిన ఇత్తడి విద్యుద్దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఆర్చ్‌కు శివపార్వతుల విగ్రహాల బిగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. శివుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తూర్పు పంచతల రాజగోపురం నుంచి దర్శించుకునేలా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నా రు. మరో వారం రోజుల్లో శివాలయం పనులను పూర్తి చేయనున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. కార్తికమాసం సందర్భంగా శివుడికి దీపారాధన చేసేందుకు శివాలయ ప్రాంగణంలో దీపా ల మండపాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.