యాదాద్రి: ఈ నెల 14 నుంచి ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం యాదగిరి గుట్ట పట్టణంలో ఆయా మండలాల ఇన్చార్జిలతో పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలు, 188 గ్రామాలు, రెండు మున్సిపాలిటీతో పాటు అవాస గ్రామా లను కలుపుకుని 324 గ్రామాలలో పూర్తయిన టీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఏర్పాటుపై ఆయా మండలాల ఇన్చార్జిలతో చర్చించారు. ఈ సందర్భంగా మండలాలవారీగా ఎంపిక పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఈ నెల 14వ తేదీన ఉదయం 11గంటలకు యాదగిరిగుట్ట పట్టణ కమిటీ, 15న ఉదయం 11 గంటలకు గుండాల మండలం, మధ్యా హ్నం 2 గంటలకు ఆలేరు మండలం, 16వ తేదీన ఉదయం 11 గంటలకు బొమ్మలరామారం, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు పట్టణ కమిటీ, 17న ఉదయం 11 గంటలకు ఆత్మకూరు(ఎం), 18వ తేదీన ఉదయం 11 గంటలకు తుర్కపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మోటకొండూర్, 19వ తేదీ ఉదయం యాదగిరిగుట్ట మండలం, మధ్యాహ్నం 2 గంటలకు రాజాపేట మండల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
మండల కమిటీల ఏర్పాటు ఆయా మండల కేంద్రాల్లోనే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెం కటయ్య, ఆయా మండలాల ఎన్నికల ఇన్చా ర్జిలు గడ్డమీది రవీందర్‌గౌడ్, ఇమ్మడి రామిరెడ్డి, దొంతి సోమిరెడ్డి, గూదె బాలనర్సయ్య, ఆర్కాల గాల్‌రెడ్డి, గౌటె లక్ష్మణ్, పల్లె సంతోష్, పూర్ణచందర్ రాజు, పల్లెపాటి బాలయ్య, కసావు శ్రీనివాస్, పాపట్ల నరహరి, చిత్తర్ల బాలయ్య, ఎరుకల హేమేందర్‌గౌడ్, లఖాన్ తదితరులు పాల్గొన్నారు.