
ఉత్సాహంగా సాగుతున్న
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు
బొమ్మలరామారం,సెప్టెంబర్9 : ఊరూరా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల కమిటీలను ఎన్నుకున్నారు. బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇండ్ల తిరుపతి, మైసిరెడ్డిపల్లి అధ్యక్షుడిగా పుట్ట మంకయ్య, తిరుమలగిరి అధ్యక్షుడిగా బానోత్ సుధాకర్, సోలిపేట అధ్యక్షుడిగా ఉడతల రాజేశ్, కంచల్‌తండా అధ్యక్షుడిగా ధీరావత్ సుమన్‌నాయక్, మేడిపల్లి అధ్యక్షుడిగా సిద్దెంకి శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, నాయకులు వడ్లకొండ ఆనంద్, కొండల్‌రెడ్డి, మల్లేశం, జూపల్లి భరత్, బుడమ వెంకటేశ్, పోషంరెడ్డి, రాజేశ్‌యాదవ్, రమేశ్ పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని, అందుకే అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఎన్నికల మండల ఇన్చార్జి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, కొలుపుల హరినాథ్, ఎంపీపీ అమరావతీశోభన్బాబు అన్నారు. మండలంలోని గుండాల, గంగాపురం, కొమ్మాయిపల్లి గ్రామ కమిటీలను గురువారం ఎన్నుకున్నారు. గుండాల అధ్యక్షుడిగా గిరికత్తుల శ్రీనివాస్‌గౌడ్, గంగాపురం అధ్యక్షుడిగా చీనూరి వెంకన్న, కొమ్మాయిపల్లి అధ్యక్షుడిగా బూడిద కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇమ్మడి దశరథ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దార సైదులు, సర్పంచ్ బాషిరెడ్డి, ఎంపీటీసీ మహేశ్, నాయకులు పాండరి, సోమిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సంగి వేణుగోపాల్, హరితాదేవి, కోలుకొండ రాములు, బండ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
రహీంఖాన్‌పేట అధ్యక్షుడిగా లింగయ్యగౌడ్
ఆత్మకూరు(ఎం) : మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సుదగాని లింగయ్యగౌడ్, దుంప శివరాజ్, బూడిద ఆంజనేయులు, సెక్రటరీ జనరల్‌గా దుంప యాదగిరి, అధికార ప్రతినిధిగా సోమరాజు, కోశాధికారిగా నర్సయ్య, సోషల్ మీడియా కన్వీనర్‌గా సాయి, రైతు విభాగం అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జయమ్మను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాషబోయిన ఉప్పలయ్య, యాస రంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, నాయకులు భానుప్రకాశ్, యశ్వంత్, శేఖర్, పర్వతాలు, పరశురాములు పాల్గొన్నారు.
8వ వార్డు అధ్యక్షుడిగా సిద్ధిరాములు
ఆలేరు టౌన్ : ఆలేరు మున్సిపాలిటీలోని 8వ వార్డు టీఆర్ఎస్ కొత్త కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నారాయణ సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా వస్పరి సాగర్, యూత్ అధ్యక్షుడిగా కటకం బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రచ్చ వరమ్మ, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ.ఖాజాను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, కౌన్సిలర్ దాసి నాగమాణి, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, నాయకులు ఆడెపు బాలస్వామి, దాసి సంతోశ్, కర్రె అశోక్, జల్లి నర్సింహులు, పాశికంటి శ్రీను, మంగళపల్లి నాగరాజు, కళ్యాణ్, ఉమాకాంత్, మహేశ్ పాల్గొన్నారు.
శర్భనాపురం అధ్యక్షుడిగా భిక్షపతి
ఆలేరురూరల్ : మండలంలోని శర్భనాపురం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా అంగడి భిక్షపతిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జీలు బండ పర్వతాలు, మొగులగాని మల్లేశ్‌గౌడ్, కొంతం శ్యామ్, కంతి మహేందర్, మామిడాల భానుచందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు చామకూర గోపాల్‌గౌడ్, కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లక్ష్మక్కపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా మహేశ్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా సిద్ధులు, యువజన అధ్యక్షుడిగా కిరణ్, బసంతాపురం అధ్యక్షుడిగా గుండ్లపల్లి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్‌గా మెండు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా భగవాన్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో…
తుర్కపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చోక్లాతండా గ్రామశాఖ అధ్యక్షుడిగా భూక్యా కిషన్, పల్లెపహాడ్-దాసరి చిన్న గురువయ్య, జేవోజీతండా-ధీరావత్ శ్రీను, బీల్యాతండా- గుగులోతు రాంసింగ్, జగ్యాతండా-గుగులోతు బాలూనాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, జడ్పీవైస్‌చైర్మన్ బీకునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశట్టి నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్, కో ఆప్షన్ సభ్యుడు షరీప్, నాయకులు హరినాయక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
వర్కట్‌పల్లి అధ్యక్షుడిగా స్వామి
వలిగొండ : మండలంలోని వర్కట్‌పల్లి టీఆర్ఎస్ కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుండు స్వామి, ప్రధాన కార్యదర్శిగా మీసాల యాదయ్య ఎన్నికయ్యారు. కార్యవర్గానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డేగల పాండరి, సర్పంచ్ మీసాల శేఖర్, నర్సింహస్వామి, సోలిపురం జనార్దన్‌రెడ్డి, గంధమల్ల బాలయ్య, మధు, శ్రీనివాస్ అభినంధించారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు : ఎన్నికల పరీశీలకుడు జిల్లా కోఆప్షన్ మెంబర్ గుండిగ జోసెఫ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పూలపల్లి జనార్దన్‌రెడ్డి అధ్వర్యంలో అడ్డగూడూరు టౌన్ అధ్యక్షుడిగా నాగులపల్లి దేవగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా తుప్పతి శ్రీశైలం, ప్రధానకార్యదర్శిగా గజ్జెల్లి రవి ఎన్నికయ్యారు.