చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా అదరగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ పోరులో అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. సాయితేజ(51 బంతుల్లో 79, 5ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు శుభమ్ రంజనె(48 నాటౌట్) రాణించడంతో అమెరికా 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది.
డచ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తెలుగు కుర్రాడు సాయితేజ సాధికారిక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. బాస్ డీ లీడె(3/37) మూడు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో హర్మీత్‌సింగ్(4/21), షాడ్లె వాన్ శాల్విక్(3/21) విజృంభణతో నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. బాస్ డీ లీడె(23) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. హర్మీత్సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.