ఢిల్లీ : టీ20 ప్రపంచకప్‌లో యూఏఈ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు.. తమ రెండో పోరులో కెనడాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. గ్రూప్-డీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మొదట కెనడాను నిర్ణీత ఓవర్లలో 150/7కే కట్టడి చేసిన ఆ జట్టు.. లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో పూర్తిచేసింది.
యూఏఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యాన్ష్ శర్మ (53 బంతుల్లో 74 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సోహైబ్ ఖాన్ (29 బంతుల్లో 51, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో ఆ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. మొదట కెనడా.. హర్ష్ ఠాకర్ (41 బంతుల్లో 50, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), నవ్‌నీత్ ధలివాల్ (28 బంతుల్లో 34, 4 ఫోర్లు) ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఐదు వికెట్లు పడగొట్టిన యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖీ (5/35)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.