
రాజాపేట, ఆగస్టు 7: దళితుల అభున్నతికోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివా రం మండలంలోని బొందుగుల గ్రామంలో దళితబంధు పథకాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ చారిత్రక దళితబంధు పథకాన్ని వాసాలమర్రి గ్రామంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపగాని యాదగిరి, మోత్కుపల్లి ప్రవీణ్, కొమ్ము పాండు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి, ఆగస్టు7: దళితబంధు పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలోని దళితవాడలో శనివారం ఆయన పర్యటించి పథకంపై దళితులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రతి పైసా వృథా కాకుండా మీకు నచ్చిన, అనుభవం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే అవకాశం ఉందన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వాసాలమ ర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించి నిధులు విడుదల చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ మంగరాజు శ్రవణ్‌కుమార్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, శ్రీనివాస్ ఉన్నారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే చేశారు. ఈనెల 4వ తేదీన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ భూములు, ఇతరుల కబ్జాలో ఉన్న భూములను వెలికితీసి ఆ భూములను దళితులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆర్డీవో భూపాల్‌రెడ్డి సర్వే, ల్యాండ్ రికార్డు ఏడీ మధుసూదన్‌తో కలిసి శనివారం గ్రామాన్ని సందర్శించి సర్వే నం బర్లు 22, 132, 133 ప్రభుత్వ, అసైన్డ్ భూములను సర్వేచేశారు. ఆయా సర్వేనంబర్లకు హద్దులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, తహసీల్దార్ జ్యోతి, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.