Manasantha Nuvve | వాలెంటైన్స్ డే స్పెషల్.. 25 ఏండ్ల తర్వాత ‘మనసంతా నువ్వే’ రీ-రిలీజ్
Manasantha Nuvve | దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'మనసంతా నువ్వే' మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Manasantha Nuvve | టాలీవుడ్ లవర్ బాయ్, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘మనసంతా నువ్వే’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సరిగ్గా 25 ఏండ్ల క్రితం విడుదలైన ఈ అద్భుత ప్రేమకథా చిత్రాన్ని ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఎం.ఎస్. రాజు నిర్మాణంలో, వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, ఉదయ్ కిరణ్ ఇమేజ్ను శిఖరాగ్రానికి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను వెండితెరపై మళ్ళీ తీసుకురాబోతున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే ఈ రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఎమోషనల్ వీడియోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైనప్పుడు తనకు కేవలం రెండు నెలల వయస్సు మాత్రమేనని, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన మామయ్య సినిమాను వెండితెరపై చూడటం చాలా స్పెషల్ అని పేర్కొంది. మరోవైపు మేనల్లుడు తేజ స్పందిస్తూ.. ఆనాడు సినిమా విడుదలైనప్పుడు తనకు ఏడేళ్లని, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్యపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపాడు. తన మామయ్య జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ కుటుంబం మొత్తం కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూస్తామని అతను ఆకాంక్షించారు. నేటి తరం ప్రేక్షకులకు కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమకథను పరిచయం చేస్తూ, రీమా సేన్, తనూ రాయ్‌ల నటన, ఆర్.పి. పట్నాయక్ అందించిన మధురమైన గీతాలతో ఈ సినిమా ప్రేమికుల రోజున థియేటర్లలో మరోసారి మారుమోగనుంది.
#UdayKiran మేనకోడలు #Mahathi వీడియో బైట్‌లో సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ❤️#ManasanthaNuvve4K రీ రిలీజ్ థియేటర్స్‌లో ఫిబ్రవరి 14న 🎬🍿#ManasanthaNuvve pic.twitter.com/4PydDi1T4K
— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

