– ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ భాస్కర్
గట్టుప్పల్, ఫిబ్రవరి 11 : గట్టుప్పల్ మండలంలోని తేరట్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పిస్తామని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ హామీ ఇచ్చారు. తన స్వగ్రామమైన తేరట్పల్లిని బుధవారం ఆయన సందర్శించారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన స్టేజీ నిర్మాణం, క్రీడా సామగ్రి కిట్లు, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, తాగునీటి సౌకర్యం కోసం ఫిల్టర్, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాల ఆవరణలో అందమైన గార్డెన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తేరట్పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొరిగే సత్తయ్య, ఫౌండేషన్ సభ్యుడు అశోక్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

‘తేరట్పల్లి పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం’