
యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):s గడిచిన రెండేండ్లలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం కార్డులను మంజూరు చేయలేకపోయింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల కు మోక్షం కల్పించి రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొద్దిరోజులుగా అధికారు లు దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. వివిధ మం డలాల నుంచి పెండింగ్ దరఖాస్తుల లెక్కలు తీసి అర్హుల జాబి తాలను రూపొందించారు. జిల్లాలో ప్రస్తుతం 2,13,807 రేష న్ కార్డులు ఉండగా.. వీటిలో ఆహార భద్రతా కార్డులు 2,00, 102, అంత్యోదయ కార్డులు 13,705 ఉన్నాయి. మొత్తం 6, 65,357 యూనిట్లకు గాను నెలనెలా రూ.కిలో లెక్కన 4, 25 1.083 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం 481 చౌక ధర ల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. అం త్యోదయ కార్డుదారులకు అర కిలో చక్కెర అందజేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులు 6,261
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు నుంచి గత నెలాఖరు వరకు కొత్త రేషన్ కార్డుల కోసం 11,062 దరఖాస్తులు ప్రభు త్వానికి వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వారు.. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు.. రేష న్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైద్రాబాద్, ముం బయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లి సొంతూళ్లకు వచ్చిన వారు సైతం గత రెండేండ్లలో పెద్ద ఎత్తున కార్డులకు దరఖా స్తు చేసుకున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు సందర్భంగా జారీ చేసిన 2,408 కార్డులు మినహా.. గడచిన రెండేండ్లలో వివిధ కారణాలతో కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్ఐ లాగిన్లో 4,416 దరఖాస్తులు, తహసీల్దార్ లాగిన్లో 763 దరఖాస్తులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికా రి లాగిన్లో 3,143 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిశీలన అనంతరం 6,261 కార్డులు అర్హత పొందినట్లు తే ల్చారు. డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదైన కొత్త కార్డుదారులకు సోమవారం నుంచే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని అంద జేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కొత్త కార్డులకు సైతం ఈనెలలో ప్రభుత్వం అందజేస్తున్న ఐదు కిలోల చొప్పు న బియ్యం అం దనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం
అర్హత సాధించిన కొత్త రేషన్ కార్డులకు సరుకులు అందజేయడంపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. డీకేఆర్లో నమోదైన వారికి సోమవారం నుంచే బియ్యం పంపిణీని ప్రారంభించాం. మిగతావారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీకేఆర్లో నమోదైన వెంటనే వారికి కూడా బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.ఇప్పటికే జిల్లాలో 2,13,807 కార్డులకు రేషన్ బియ్యాన్ని అం దజేస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల మంజూరీతో ఈ సంఖ్య 2,22,068కి పెరిగింది.
– బ్రహ్మారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా