సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నిరోజులుగా వరుసహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ల పరిధిలో రోజురోజుకూ రౌడీషీటర్లు, పాతనేరస్తులు, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయి. పోకిరీలు, అల్లరిమూకలు ముఠాలుగా ఏర్పడి రాత్రీ, పగలూ తేడా లేకుండా అకారణం గా దాడులకు పాల్పడడం, ప్రత్యర్థులతో కొట్లాట లు, గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు చేయ డం పరిపాటిగా మారింది. మద్యం, గంజాయి మత్తులో తిరుగుతున్న ముఠాలు చిన్నచిన్న విషయాలకే మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నా యి. యువకులు తమ ప్రాంతాల్లో ఆధిపత్యా న్ని ప్రదర్శించడం కోసం ఇతరుల రక్తం కళ్లచూస్తూ చిన్న చిన్న కారణాలకే కత్తులతో కిరాతకంగా చం పుతున్నారు.
తనను చూసి మిగిలినవారు భయపడాలనే ఉద్దేశంతో , తానొక రౌడీని అనిపించుకోవడమే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారని చాలామందిని విచారణ చేసే క్రమంలో వారి ప్రవర్తనాతీరు విచిత్రంగా ఉంటున్నదని పోలీసులు చెప్తున్నారు. పోలీసులంటే భ యం లేకుండా, కోర్టులు, శిక్షలు అంటే లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా యి. అయితే పాతక క్షలు, ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం జరిగే పలు హత్యలను అడ్డుకునేదిశగా తమకున్న నెట్వర్క్ ద్వారా అవకాశమున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పోలీసులు నిందితులతో మిలాఖత్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారే చెప్పారు. తమ విస్తృత నిఘాతో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన పోలీసులు ఆ దిశగా చురుకుగా వ్యవహరించకపోవడంతో నగరంలో నేరాలు పెరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
పోలీసు నిఘా కరువు..!
గత రెండేళ్లుగా ఏయేటికాయేడు నేరాలు పెరుగుతున్నాయి. అయితే పోలీసు కమిషనర్లు తమ సంవత్సరాంతం ప్రెస్మీట్లలో నేరాలు తగ్గాయని చెబుతూ అందుకు తగినట్లుగా గణాంకాలు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నేరాల సంఖ్య తగ్గడం లేదు. రోజుకు రెండుమూడుచోట్ల మర్డర్లు, దోపిడీలు, దాడులతో నగరం ఉలిక్కిపడుతోంది. హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వా త గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండేళ్లలో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగాయి. సెటిల్మెంట్లతో పాటు ఆధిపత్యం కోసం గ్యాంగ్‌వార్‌లకు దిగి ప్రత్యర్థులను హతమారుస్తున్నారు. కాలాపత్తర్, ఆసిఫ్‌నగర్ , టోలీచౌకి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నా యి. రౌడీషీటర్ల ఆగడాలు పెరగడానికి నిఘా వైఫల్యమే కారణమనే చర్చ జరుగుతోంది.
హత్య లు, హత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు చేసి జైలుకెళ్లి బయటకు వచ్చిన పాతనేరస్తులపై పోలీసులు నిఘా పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు జైలు నుంచి ఎప్పుడు బయబటకు వస్తున్నారు.. మళ్లీ నేరాల బాటపడుతున్నారా.. అసలు ఏం పనిచేస్తున్నారు.. ఇలా అనేక విసయాలను పో లీసులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఘరానా నేరస్తులు, రౌడీషీటర్లు, దోపిడీదొంగలు, కబ్జాదారుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. పాత నేరస్థులపై పోలీస్ నిఘా లేకపోవడం వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్తులు మరింతగా రెచ్చిపోయి ముఠాలుగా ఏర్పడి మరింత అరాచకాలు సృష్టిస్తున్నారు. దారుణ హత్యలకు, నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా పరిచయస్తులే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. రక్తసంబంధీ కులు, స్నేహితులు, తెలిసినవారే దారుణాలకు ఒడిగడుతున్నారు. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనో, డబ్బుల పంపకాలు, ఆస్తి పంపకాల్లో తేడాలు.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఘటనల్లో తెలిసినవారే హంతకులు, నేరస్తులుగా తేలుతున్నారు. డబ్బులు, ఆస్తి, మద్యం, మగువ అనేవి ప్ర ధాన కారణాలుగా ఉంటున్నాయని ఆయా కేసుల్లో పో లీసులు విచారించే సమయంలో పలు కారణాలు వెలుగుచూస్తున్నాయని పోలీసులు చెప్పారు.
కొన్ని సంఘటనలివే..
సమీపంలోని కేతిరెడ్డిపల్లిలో ఈనెల 4న మహిళా న్యాయవాది స్వప్నను పథకం ప్రకారం హత్యచేశారు. భూవివాదం నేపథ్యంలో సర్వే కోసం వెళ్లిన స్వప్నను కారుతో ఢీకొట్టి తర్వాత రాళ్లు , కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి హత్యచేసి నిందితులు పారిపోయారు.
జిల్లా అత్తాపూర్‌లో న్యాయవాది షరీఫ్‌ను ఈనెల 14న ఆయన బావమరుదులే హత్యచేసి పరారయ్యారు. సులేమాన్‌నగర్‌లోని తన ఆఫీసులో ఉన్న ఖదీర్‌పై కత్తులతో దాడిచేసి పలుమార్లు పొడవడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
నడిరోడ్డుపై పట్టపగలు ఓ రౌడీషీటర్ తన స్నేహితులతో కలిసి మరో రౌడీషీటర్‌ను కత్తులతో చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒకప్పుడు ప్రాణస్నేహితులు గా ఉన్న ఆ ఇద్దరు ఓ మహిళ విషయంలో మనస్పర్థలు రావడంతో రెండు వర్గాలుగా విడిపోయారు.
నగరంలోని ఓ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కారులో 45ఏళ్ల వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చిన 20ఏళ్లలోపు యువకులు.. టిఫిన్ చేస్తున్న క్రమం లో మీద చట్నీ పడేశారన్న కోపంతో ఆ వ్యక్తిని కారులో ఎక్కించుకుని రాత్రంతా నగరంలో తిప్పుతూ పిడిగుద్దులతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో పొడిచి చంపేశారు.
చెందిన ఓ వ్యక్తి గుడెన్మెంట్ ఫుట్ఓవర్ బ్రిడ్జి వద్ద తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి అక్కడే పడుకుని ఫోన్లో మాట్లాడుతుండగా.. ఓ పాతనేరస్తుడు అక్కడికి వచ్చి తాను ఇక్కడే కూర్చుంటానని కాస్త చోటివ్వమని అడిగారు. అతను జరగకపోవడంతో అతని కాళ్ల వద్ద కూర్చునే ప్రయత్నం చేయగా అజయ్‌ను గఫూర్ కాలితో తన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వా గ్వాదం జరిగి కత్తిపోట్లకు దారితీయగా గఫూర్ అక్కడికక్కడే మృతిచెందాడు.