
ఆత్మకూరు(ఎం), జూలై 5 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్నదని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండ లంలోని పల్లెర్లలో పల్లె ప్రగతిలో భాగంగా రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను సోమవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులంతా ఒక్కచోట చేరి సమ స్యలను పరిష్కరించుకోవడంతో పాటు నూతన వ్యవసాయ ప ద్దతులపై శిక్షణ కోసం కూడా రైతు వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీపీ తండ మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్ గుప్తా, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండల కోఆర్డినేటర్ ఇంద్రారెడ్డి, స ర్పంచ్ నర్సింహారెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి అనురా ధ, మండల ప్రత్యేకాధికారి శ్యామ్ సుందర్, తహసీల్దార్ జ్యో తి, ఎంపీడీవో రాములు, ఎంపీటీసీ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ స్వరూప, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో శ్రీనివాస్, ఏఈవో సరిత పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని 45మంది లబ్ధిదా రులకు మంజూరైన రూ. 45లక్షల 5వేల 220ల కల్యాణ లక్ష్మి చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పం పిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నగేశ్, సత్తయ్య, మా ధవి, వరలక్ష్మి, ప్రమీల, రమేశ్, ఎంపీటీసీ కవిత పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడు తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాలువపల్లికి చెందిన సురేశ్ కిడ్నీ వ్యాధితో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతు న్నాడు. చికిత్స కోసం రూ.4లక్షల ఎల్వోసీ ప్రభుత్వం మం జూరు చేయగా సోమవారం బాధితుడి కుటుంబానికి ప్రభుత్వ విప్ హైదారాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు.
మత్స్యకార్మికులకు అండగా ప్రభుత్వం
గుండాల: మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వి ధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండ లంలోని రామారం గ్రామానికి చెందిన బండారు సుశీల అనే మత్స్యకార కుటుంబానికి సబ్సీడీపై మంజూరైన చేపల విక్రయ వాహానాన్ని అందజేశారు.కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీ, కో ఆప్షన్ ఖలీల్,వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి,సర్పంచ్‌లు గాయత్రి, వరలక్ష్మి, సంఘం డైరెక్టర్ మధు ,రామకృష్ణారెడ్డిపాల్గొన్నారు.
పేదింటి ఆడపడుచులకు వెన్నుదన్ను
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వెన్నుదన్ను అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండలానికి మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ ఎండీ.ఖలీల్, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, వైస్ ఎంపీపీ మహేం దర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇమ్మడి ధశరథ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ పీ సంగి వేణుగోపాల్, ఎంపీటీసీ పొన్నగాని మహేశ్, నాయకు లు గడ్డమీది పాండరి,బబ్బూరి సుధాకర్, రంగారెడ్డి,చెన్నారెడ్డి, చిందం ప్రకాష్, ఓడపల్లి మధు, అట్ల రంజిత్‌రెడ్డి, అన్నెపర్తి భిక్షం, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ వో జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.