శామీర్ పేట, ఫిబ్రవరి 8: అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటిం ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఆదివారంప్రచారంలో 20వ వార్డు అభ్యర్థి రోజా రాజు, 8వ వార్డు అభ్యర్థి లక్ష్మీరామ్ రెడ్డి, తురపల్లి 13వ వార్డు అభ్యర్థి యూసుఫ్, తురపల్లి 1వ వార్డు అభ్యర్థి వెంకటేశ్, 2వ వార్డు అభ్యర్థి లావణ్య, 3వ వార్డు అభ్యర్థి రవి, 4వ వార్డు అభ్యర్థి కవిత, మసీదుపూర్ 10వ వార్డు అభ్యర్థి మాధవి గౌడ్, 11వ వార్డు అభ్యర్థి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
17వ వార్డులో ముమ్మర ప్రచారం..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలియాబాద్ 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం మధుసూదన్ రెడ్డికి మద్దతుగా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మలాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విసృ్తతంగా పర్యటించారు. కారు గుర్తుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.