
రాజాపేట, జూలై 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా శనివారం రాజాపేట మండలం రేణి కుం టకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నా రు. గ్రామంలో విసృత్తంగా పారిశుధ్య పనులు చేపట్టడంతో వీధులన్ని అద్దంలా తలపిస్తున్నాయి. సూర్యాపేటలో నిర్వహిం చే పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసిన వెంటనే సాయంత్రం రేణి కుంట గ్రామాన్ని సందర్శించనున్నారు. మొదటగా సాయూద పోరాట యోధుడు చింతలపూరి రాంరెడ్డి విగ్రహానికి పూలమా లలు వేసిన అనంతరం పల్లె ప్రగతి నిధులతో నిర్మించిన వైకుం ఠధామ పనులను ప్రారంభించనున్నారు. ఆదేవిధంగా పల్లె పకృతి వనం, డంపింగ్‌యార్డ్ షెడ్, పారిశుధ్య పనులను పరిశీ లించనున్నారు. దళితవాడలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సమా వేశంలో పాల్గొంటారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కాగా మంత్రుల పర్యటన నేపథ్యంలో రేణికుంటలో మావేశం ఏర్పాటు చేసే స్థలంతో పాటు, వైకుంఠధామం, పల్లె పకృతి వ నం, డంపింగ్‌యార్డు షెడ్, పారిశుధ్య పనులను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, జడ్పీటీసీ గోపా ల్గౌడ్, డీఎల్పీవో యాదగిరి, ఎంపీడీవో రామరాజు, ఎంపీ వో దినకర్, సర్పంచ్‌లు భాగ్మమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, ధర్మేందర్సిం గ్, సంతోశ్‌గౌడ్, సతీశ్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి, గాల్‌రెడ్డి, రాములునాయక్, సీసీబ్యాంక్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.
వడాయిగూడానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాక
భువనగిరి అర్బన్: మండలంలోని వడాయిగూడెంలో నూత నంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహా ఆవిష్కరణ నేటి ఉదయం 11గంటలకు జరుగనుంది.ఈ కా ర్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువ జన, సర్వీసుల, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, అంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ హాజరవనున్నారు.