మోటకొండూర్, అక్టోబర్ 06 : శాలివాహనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, ఆ సంఘం యువజన విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జివిలికపల్లి వెంకటేశ్ అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు కుమ్మరి సంఘం యువజన విభాగం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్ ను సోమవారం ఘనంగా సన్మానించారు. అర్హులైన ప్రతి శాలివాహనులకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటకొండూర్ మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు జివిలికపల్లి రాములు, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, ఎమ్మార్పీఎస్ నాయకులు వంగపల్లి మహేందర్, ప్రెస్ క్లబ్ సభ్యులు లోడే చంద్రశేఖర్, సురపంగ శ్రీనివాస్, పుల్లె నరేశ్, వివిధ పార్టీల నాయకులు కొరటికంటి శ్రీకాంత్, దడిగే మధు, బోట్ల పాండు పాల్గొన్నారు.