భూదాన్ పోచంపల్లి, జనవరి 12 : చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి రుణమాఫీ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయక కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని, రుణమాఫీ విషయంలో కాలయాపన చేస్తూ కార్మికులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. చేనేత కార్మికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సీత వెంకటేశ్, మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కoదాల భూపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, కౌన్సిలర్ గుండు మధు, కర్నాటి రవీందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేశం గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాల నర్సింహ, నాయకులు ముత్యాల మహిపాల్ రెడ్డి, కందాల సుధాకర్ రెడ్డి, కర్నాటి రవి, గుండు మధు, గంజి బసవలింగం, ఎన్నం శివకుమార్, మంగళపల్లి శ్రీహరి, జల్లి నరసింహ, కర్నాటి పురుషోత్తం, గుండు ప్రవీణ్, బోడ దయానంద్, జల్దీ నరసింహ, భారత భూషణ్, భారత గిరివాసు, బొమ్మ హరిశంకర్, వనం వెంకటేశం, కొంక లక్ష్మీనారాయణ, కర్నాటి అంజమ్మ పాల్గొన్నారు.