రాజాపేట, ఏప్రిల్ 13 : సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని బీఆర్ఎస్ రాజాపేట మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపురం మాజీ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎమ్మ భాస్కర్ స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని అదిరేది బెదిరేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతానికి సాగు నీళ్లు ఇవ్వాలనే సోయిలేని ఎమ్మెల్యే పోలీసులను ఒత్తిడి చేసి బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయమని పురమాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులను కేసులతో భయపెట్టే పనులు మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. గెలిచిన రెండు నెలల నుండి రాజాపేట ప్రాంతానికి సాగునీళ్లు అందిస్తామని ప్రగల్బాలు పలికిన ఎమ్మెల్యే ఇప్పటికీ తట్టెడు మట్టిని తీసిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్, నాయకులు గుంటి మధుసూదన్ రెడ్డి, ఎర్ర గోగుల జస్వంత్, బొంగోని ఉప్పలయ్య గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, గోపగాని యాదగిరి గౌడ్, దగ్గుల విష్ణు, జూకంటి జానకి రాములు, తుంగ అక్షయ్ కుమార్, తుంగ వేణు, పృధ్వీరాజ్, సతీష్, రాజిరెడ్డి, భరత్, ప్రశాంత్, దుర్గయ్య, గణేష్, హరినాథ్, ఎల్లయ్య, బాలయ్య, అశోక్ రెడ్డి, శ్రీను, రాజు, వెంకట్, నవీన్, యాదగిరి, సాయి, నర్సిరెడ్డి, మహేందర్, గోపాల్, కొమురయ్య, ఉప్పలయ్య, శ్రీను, గణేష్ పాల్గొన్నారు.