చౌటుప్పల్, జులై 09 : విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్ డీఎస్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర విద్యుత్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ డివిజన్ కార్యాలయం ముందు మధ్యాహ్నా భోజన విరామ సమయంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలు విద్యుత్ సంస్థలను నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఈ విధానంతో గతంలో ఒడిశా రాష్ట్రంలో జరిగిన పరిణమాలను ఆయన గుర్తు చేశారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ కలిసి పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల ప్రతినిధులు గంగుల సోమేశ్వర్ రెడ్డి, బోయ మల్లేశ్, జె.నర్సింహ్మ, విజయ్‌కుమార్, పి.తిరుమలయ్య, మీర్జా షకీల్ బేగం, సురేందర్ రెడ్డి, అశోక్, అక్బర్, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి, సురేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.