ఆలేరు టౌన్, ఫిబ్రవరి 02 : ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏడో వార్డులో మాజీ కోఆప్షన్ సభ్యురాలు, ఏడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బింగి లత రవి మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతుంది. సోమవారం ఆమె మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హయాంలో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. మైత్రి కాలనీ, మార్కండేయ నగర్, సిల్క్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, బింగి నరసింహులు, మహిళా నాయకురాలు చింతకింది రేణుక, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.