భువనగిరి అర్బన్: సెప్టంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం కలెక్టర్ భువనగిరి మున్సిప ల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎ స్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, సంక్షేమశాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై మార్గదర్శకాలు వివరించారు.
ఈ నెల 30లోగా అన్ని విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనల మేరకు పారిశుధ్య పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కళశాలల ఆవరణ, వంట గదులు పరిశుభ్రంగా ఉంచాలని, తాగు నీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, సిబ్బందితో సమన్వయం చేసుకుని తరచూ వైద్య సిబ్బంది పర్యటించేలా చూడాలన్నారు.
కరోనా లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్లతో పరిక్షించి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూ పాలని, ప్రిన్సిపల్, వార్డెన్లు, హెడ్ క్వార్టర్లలోనే ఉండాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటించాలని, పండుగ వాతావరణంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల్లో హాస్టల్స్ ప్రారంభానికి చర్యలు తీసుకో వాలన్నారు.
ఈ సమావేశంలో ఏస్సీ అధివృద్ధి బాల్సింగ్, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, మైనార్టీ జిల్లా అధికారి సత్యనారాయణ, గిరిజన సంక్షేమ అధికారి మంగ్తనాయక్, రెసిడెన్షియల్ పాఠశాలల రీజనల్ కో-ఆర్డినేటర్ రజని, సజ్జన్‌కుమార్, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.