యాదాద్రి భువనగిరి : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని బాధితులు ఆందోళన బాట పట్టారు. భూమినే నమ్ముకొని జీవిస్తున్న తమ పొట్టలు కొట్టొద్దని వేడుకుంటున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని చిమిర్యాల గ్రామంలో మునుగోడు- చౌటుప్పల్ రహదారిపై ట్రిపుల్ ఆర్ బాధితులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. అంతకుముందు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.