రామన్నపేట, జనవరి 24 : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్ జిల్లా, రాష్ట్రస్థాయి అండర్ -14 రగ్బీ పోటీల్లో రామన్నపేట మండలంలోని వెల్లంకి ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతిని పొందారు. వెల్లంకి హై స్కూల్ కు చెందిన ఆర్.మహేశ్వరి, అలేఖ్య, భవాని, నాగ సుప్రియ, ఉషశ్రీ, మిన్ను, మాన్వి, సహస్ర, ఎం.సహస్ర, నక్షత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతిని సాధించిన విద్యార్థులను శనివారం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడు టి.సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.