రాజాపేట, మే 13 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నెమిలే క్రాస్ రోడ్ వద్ద మంగళవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే వారి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు. వాహనాలకు పెండింగ్ చాలాన్లను పరిశీలించారు. హెల్మెట్ ధరించకుండా, పత్రాలు లేని వాహనదారులకు చాలాన్లు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది శ్రీధర్ రెడ్డి, విజయ, నవీన్‌కుమార్, నరేశ్ పాల్గొన్నారు.