బీబీనగర్, జనవరి 20 : వాసవీ కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీబీనగర్ మండలంలోని మహాదేవ్‌పూర్ గ్రామంలో ప్రముఖ ఆలయం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తీపిరిశెట్టి సత్యనారాయణ గుప్తా, ప్రధాన కార్యదర్శి గార్లపాటి కృష్ణమూర్తి గుప్తా, ప్రొద్దుటూరు రాఘవేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు మాశెట్టి కృష్ణమూర్తి గుప్తా, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, మాశెట్టి హరిబాబు, జాగిని మధుసూదన్, దాచేపల్లి సోమయ్య, రాగి జగదీష్, పసుపునూరి రమేష్, కాచారం భిక్షపతి, బొడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.