Valigonda : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. డీసీపీ నారాయణరెడ్డి

వలిగొండ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో గురువారం రాత్రి జరిగిన దొంగతనంపై శుక్రవారం విచారణ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు, దొంగతనాలు అదుపులో ఉంటాయని, దుకాణాల యజమానులు పెద్దమొత్తంలో నగదును రాత్రి వేళల్లో దుకాణల్లో ఉంచరాదని సూచించారు.
ప్రతి షాపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల సమాచారంతో నేరస్తులను త్వరగ పట్టుకుని బాధితులకు సత్వరమే న్యాయం అందుతుందన్నారు. నగదు చోరీపై వేగంగా దర్యాప్తు చేపట్టి నింధితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఎరువుల దుకాణం యజమాని రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట సీఐ మోతీరాం, స్థానిక ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

