యాదాద్రి భువనగిరి, మార్చి 14 : పదిహేను రోజులకోసారి నీటి సరఫరా.. కిలోమీటర్ల దూరం నుంచి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు.. ప్రైవేట్లో డబ్బులు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీళ్ల కొనుగోలు. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో పరిస్థితి. ఎండకాలానికి ముందే నీటి తిప్పలు తప్పని దుస్థితి నెలకొంది.
అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఓట్లని వస్తే బిందెలు తీసుకుని కొడతామని హెచ్చరిస్తున్నారు. ఒక్క చుక్క నీళ్లు లేవు. బాత్రూమ్ పోతన్కి కూడా నీళ్లేవ్ అన్న చిన్నారుల వీడియో వైరల్గా మారింది.