ఆత్మకూరు(ఎం), నవంబర్ 10 : అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలోని 1వ సెంటర్ అంగన్వాడీ ఆయా రజిత తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఐసీడీఎస్ మోత్కూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ యామినికి సోమవారం అందజేసింది. రజిత అంగన్వాడీ ఆయాగా గత 14 ఏండ్లుగా సేవలందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కక్ష్య సాధింపుతో వేధింపులకు గురి చేస్తుండడంతో విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపింది.