ఆలేరు టౌన్, ఆగస్టు 29 : జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య మేరా యువ భారత్ యాదాద్రి జిల్లా సౌజన్యంతో జిల్లా క్రీడల అధికారి ధనుంజయను శుక్రవారం ఘనంగా సన్మానించారు. పిల్లలు చిన్నతనం నుండే క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. సన్మానం అందుకున్న వారిలో కబడ్డీ క్రీడాకారులు కటిక శ్రీనివాస్, మాదాసు ఫిలిప్స్, మాదాస్ జోసఫ్ అట్లాటిక్స్, కోచ్ పూసలోజి కృష్ణ, కో కో క్రీడాకారుడు పూల చంద్రకుమార్, హాకీ కోచ్ మురళి, యాట సందీప్, కళ్యాణ్, శ్రీకాంత్, లక్ష్మీకాంత్, తుంగ పాండు, మాధవ్, అనిల్, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.