రాజాపేట, ఏప్రిల్ 09 : రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బూరుగు పోశెట్టి (60) తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడగా తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ గీత కార్మికుడిని చికిత్స కోసం భువనగిరి ఏరియా దావాఖానకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోశెట్టి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు పాండవుల లక్ష్మణ్ గౌడ్ కోరారు.