భూదాన్ పోచంపల్లి, జూన్ 08 : లక్నోలో జరిగిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమ్మేళనం(2026) లో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు మూడు జాతీయ అవార్డులు లభించాయి. జూన్ 5 నుండి 7వ తేదీ వరకు లక్నోలో భారత్ రత్న సహకారిత సమ్మన్ సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. పోచంపల్లి బ్యాంకుకు బెస్ట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఇయర్ తడక రమేష్, బెస్ట్ ఎన్ పి ఏ మేనేజ్మెంట్ అవార్డులను లక్నో ఎమ్మెల్యే పూకాన్ చేతుల మీదుగా బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్ అందుకున్నారు. పోచంపల్లి బ్యాంక్ మూడు జాతీయ అవార్డు అందుకోవడం పట్ల ఖాతాదారులు, వాటాదారులు, పలువురు నాయకులు, బ్యాంక్ సిబ్బంది పాలకవర్గ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరి శంకర్, సురపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ పాల్గొన్నారు.