యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఉదయం వరకు దంచికొట్టింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో 8 నుంచి 13 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం నమోదయింది.
వలిగొండ, ఆత్మకూరు మండలాల్లో వర్షం నీళ్లు ఇండ్లలోకి చేరింది. పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం చౌటుప్పల్ మండలంలో వేలాది కోళ్లు మృత్యువాత పడింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.