రాజాపేట, నవంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజాపేట మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపోలు మధుసూదన్, మహిళా ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దార్ల రామకృష్ణ,
ప్రధాన కార్యదర్శిగా జూల మహేందర్, కోశాధికారిగా ఎండి అఖిల్, కార్యదర్శులుగా నరేశ్, వెంకటేశ్, రజిత, మహిళా కమిటీ కన్వీనర్ గా కిలాడి ధనలక్ష్మి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ గా రాజరాజేశ్వరి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ కన్వీనర్ గా కీర్తి సరిత, రాజాపేట కాంప్లెక్స్ కన్వీనర్ గా లెనిన్, రఘునాథపురం కాంప్లెక్స్ కన్వీనర్ గా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జూకంటి కరుణాకర్, ఎన్నికల పరిశీలకునిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, లెనిన్, నరేశ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.