భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 28 : పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు హైదరాబాద్లో రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని, మిత్తిల భారంతో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు . పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మన్నె పద్మా రెడ్డి, నాయకులు గోడల ప్రభాకర్, అంజయ్య గౌడ్, వెంకటాపురం రాజేందర్, వెంకట్ రామ్ రెడ్డి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.