అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు వేర్ హౌసింగ్ గోదాములను ప్రారంభించారు. గోదాముల ప్రారంభం ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నిలువ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
గోదాములను ప్రారంభించిన సందర్భంగా కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జిల్లాపరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.