ఆలేరు టౌన్, ఆగస్టు 05 : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పిన 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరులో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం ఆర్.జనార్ధన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా పూర్వపు జేఏసీ కన్వీనర్ సుంకరి సత్యనారాయణ, తదితరుల మరణాలకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో జనార్ధన్, మొరిగాడి వెంకటేశ్, ఇక్కిరి శ్రీనివాస్, చెక్క వెంకటేశ్, ఆడేపు బాలస్వామి, జంపాల శ్రీనువాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన చారిత్రాత్మకమైన పోరాటంలో ఆలేరు ప్రాంత ఉద్యమకారుల పాత్ర మరువలేనిదన్నారు. ప్రతి గ్రామం నుంచి పదుల సంఖ్యలో వేలాది మంది మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక కన్వీనర్‌గా మొరిగాడి వెంకటేశ్, కో – కన్వీనర్ గా ఇక్కిరి శ్రీనివాస్ తో పాటు, కమిటీ సభ్యులుగా ఆడేపు బాలస్వామి, పద్మశ్రీ సుదర్శన్, చెక్క వెంకటేశ్, రచ్చ రాననర్సయ్య, మామిడాల నర్సింహులు, జంపాల శ్రీనివాస్, మామిడాల అంజయ్య, బైరి విశ్వనాథం, ఎం.డీ.కుర్షిద్ పాషా, బడుగు జహంగీర్, కర్రె అశోక్, బందేల సుభాష్, పోరెడ్డి శ్రీనివాస్, ఎం.డీ.మాదార్, పోతు ప్రవీణ్, మొరిగాడి అశోక్, మొరుగాడి ఇందిరా, తునికి దశరథ, గుజ్జ అశోక్, సలహాదారులుగా అకవరపు మోహన్ రావు, ఆర్.జనార్ధన్, పసుపునూరి వీరేశం, పూల నాగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.