రామన్నపేట, అక్టోబర్ 15 : రామన్నపేట మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం, ఉదాధ్యాయులు కలాం జీవితాన్ని, దేశానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాలలో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 9వ, 10వ తరగతుల విద్యార్ఢులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నందున ఖాళీ కడుపులతో చదవడానికి విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పాఠశాల ఉపాధ్యాయులందరూ స్నాక్స్ అందివ్వడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెట్ ప్రధానోపాధ్యాయుడు దొడ్డి స్వామి, ఉపాధ్యాయులు తిరుమల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మనోహర్ మంజుల, త్రివేణి ప్రసాద్, మంజుల, పాల్వంచ హరికిషన్, గాదె పారిజాత, అమరయ్య, గణేశ్ పాల్గొన్నారు.