బీబీనగర్, జూలై 18 : విద్యార్థులు సైన్స్, శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు, వర్చువల్ రియాల్టీ ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, వర్చువల్ రియాలిటీ లాంటి సౌకర్యాలు కల్పించి, విద్యార్థులు శాస్త్రీయంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ సలహాదారు వెంకట్రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు భునారెడ్డి ప్రీతి రెడ్డి, జి సి ఎన్ ఆర్ ట్రస్ట్ ప్రతినిధి అరుణ్ కుమార్, పాఠశాల హెచ్ఎం బాల్ రెడ్డి, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, జ్యోతి, యాదయ్య, శ్రీనివాసులు, ఉమ, అశోక్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు.
Bibinagar : విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి : ఆకునూరి మురళి