రాజాపేట, నవంబర్ 11 : రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్క కాటు వేస్తే రేబిస్ వ్యాధి రాకుండా పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం తప్పకుండా ఇప్పించాలన్నారు. కుక్క కాటు వేసిన 20 నిమిషాల లోపు గాయాన్ని నీటితో, డెటాల్ ద్రావణంతో శుభ్రంగా కడిగి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి, వైద్యుల సలహా మేరకు టీకాలు వేయంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్నెం శ్రీనివాసరెడ్డి, పశు వైద్య సిబ్బంది టీ.శ్రీకాంత్ పాల్గొన్నారు.