తిమ్మాజిపేట, ఫిబ్రవరి 25 : తమ కూతురు అరుదైన న్యూరోట్రాన్స్మీటర్ డిజార్డర్‌తో బాధపడుతుందని, ఎలాగైనా ఆదుకోవాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వేడుకున్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్‌ను తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేశ్, కవిత దంపతులు కలిశారు. తమ బిడ్డ లక్షితకు వచ్చిన వ్యాధికి చికిత్స చేసేందుకు రూ. కోట్లలో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనవరి 17న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అయ్యో.. పాపం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని కేటీఆర్‌కు చూపించగా ఆయన చదివారు. బాలిక రిపోర్ట్స్, ఫోన్ నంబర్ తీసుకోవాలని అక్కడున్న సహాయకులకు సూచించారు.